ఈ నెల 31న జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, డబుల్ బెడ్రూ ఇళ్లు, సభాస్థలి, హెలిప్యాడ్ నిర్మాణ పనులు పర్యవేక్షించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల బాధ్యతలను కలెక్టర్ కె.నిఖిల, డీసీపీ, జిల్లా అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత