Errabelli holi Dance: ఎల్లప్పుడు ప్రజాసేవలో తీరికలేకుండా బిజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోలాటం అందరినీ ఆశ్చర్యపరిచారు. మహిళలతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి-పొట్టిగుట్ట శివారులోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా దారిలో లంబాడీ గిరిజన మహిళలు కనిపించారు.
మార్గమధ్యలో లంబాడీ గిరిజన మహిళలు హోలీ ఆడుతూ కనిపించారు. వారిని చూసిన మంత్రి వాహనాన్ని ఆపి మహిళలను పలకరించారు. మంత్రికి గిరిజన మహిళలు బొట్లు పెడుతూ తమతో పాటు హోలీ అలాగే కోలాటం ఆడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారి కోరికను మన్నించిన మంత్రి వారితో కొద్దిసేపు చప్పట్లు కొడుతూ కోలాటం ఆడి, అక్కడున్న వాళ్లందరినీ ఆనందపరిచారు.
ఇదీ చూడండి: