రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోలు, సమీకృత మార్కెట్ నిర్మాణం, పర్యాటక, కొవిడ్ అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
గత అనుభవాల నేపథ్యంలో పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. జనగామ జిల్లాలో మూడు లక్షల 67వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా మేరకు... జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 28 లక్షల గోనె సంచులు, 4,592 టార్పాలిన్లు 203 తూకం యంత్రాలు, 5 గోదాములు, 35 రైస్ మిల్లులు అందుబాటులో ఉన్నాయని గ్రామంలో కొనుగోలు సక్రమంగా జరిగేందుకు ఒక అధికారిని ఇంఛార్జిగా నియమించాలని సూచించారు.
ఇదీ చూడండి: రుయ్యాడి పంచాయతీకి దీన్‌దయాళ్ సశక్తి కరణ్ పురస్కారం