డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాల్లో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో రైతు వేదిక, మహిళా స్త్రీ శక్తి భవన నిర్మాణాలకు ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పేదల సొంతింటి కలైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు... పాలకుర్తిలో నత్త నడకన సాగుతున్నాయని కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి పాలకుర్తికి 5,000 ఇళ్ళు మంజూరు చేయించానని చెప్పారు. పూర్తైన ఇళ్ళ ప్రారంభోత్సవం ఈ నెల 25లోపు జరగాలన్నారు. వారంరోజుల్లో గృహ నిర్మాణాలు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ నిఖిలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్‌కు కూల్చడం తప్ప.. బతుకులు నిలబెట్టడం తెలియదు'