Man buried in Septic Tank Jangaon : మాయదారి మద్యం ఎన్నో జీవితాలు ఆగం చేస్తోంది. అలా మద్యం మత్తుతో ఓ కుటుంబంలో చెలరేగిన వివాదం.. సొంత అల్లుడిని హతమార్చే వరకు తీసుకొచ్చింది. మత్తు దిగాక తాము చేసిన పని చూసి షాకైన నిందితులు.. గుట్టుచప్పుడు కాకుండా అల్లుడి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చి పెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జనగామ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడానికి చెందిన చింత అబ్బసాయిలు-లక్ష్మికి ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె శైలజను ఇరవై ఏళ్ల కిందట తన సోదరి కుమారుడైన కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన రామిండ్ల నాగరాజు(45)తో వివాహం చేశారు. మగ సంతానం లేకపోవడం.. పైగా సొంత మేనల్లుడు కావడంతో చేదోడువాదోడుగా ఉంటాడని నాగరాజును ఇల్లరికం తెచ్చుకున్నారు. శైలజ-నాగరాజులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో నాగరాజు మద్యానికి బానిసైయ్యాడు. తరచూ నాగరాజు మద్యం సేవించి ఇంటి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. గతంలో దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై భార్య ఫిర్యాదు కూడా చేసింది.
Husband Killed Wife in Hyderabad : క్షణికావేశం.. పది రోజుల వ్యవధిలోనే ఐదు హత్యలు
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి నాగరాజు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్యతో గొడవపడ్డాడు. భార్య మాత్రం అతనికి నచ్చజెప్పి అన్నం తినిపించే ప్రయత్నం చేస్తుండగా ఆమె చేతి వేలును గట్టిగా కొరికాడు. కుమార్తె అరుపులు విన్న తండ్రి అబ్బసాయిలు అక్కడికి వచ్చి కోపంతో నాగరాజు చెంపపై గట్టిగా కొట్టాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన అల్లుడు.. మెడపై ఉన్న కండువాతో తన మామకు ఉరి బిగించాడు. ఈ క్రమంలోనే అబ్బసాయిలు కూడా అల్లుడి మెడలోని కండువాతో అతనికి ఉరి బిగించగా నాగరాజు చనిపోయాడు.
పిల్లలు లేరనే వంకతో.. తోడికోడళ్ల దారుణ హత్య
Man Killed and buried in Septic Tank Jangaon : అనంతరం భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా సెప్టిక్ ట్యాంక్‌లో తలకిందులుగా వేసి పూడ్చి పెట్టారు. అసలేం జరగనట్టు.. మరుసటి రోజు వారి పనుల్లో యాథావిధిగా బిజీ అయిపోయారు. మంగళవారం ఉదయం జనగామలోని తన స్నేహితుడి ఇంటి నుంచి వచ్చిన మృతుడి పెద్ద కుమారుడు కిరణ్.. ఇంట్లో తన తండ్రి లేకపోవడం గమనించాడు. చెల్లాచెదురగా పడిఉన్న దుస్తులను చూసి ఆరా తీయగా.. అసలు విషయం బయటకు వచ్చింది. భయపడిన కుటుంబ సభ్యులు గ్రామంలోని ఎంపీటీసీ సభ్యుడు జాకీర్‌కు సమాచారం ఇచ్చారు.
Father in Law strangled Son in Law Jangaon : ఆయన సర్పంచ్ బిళ్ల అంజమ్మ యాదవరెడ్డికి జరిగిన విషయం వివరించారు. వారి సూచనతో నిందితులు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకు నుంచి బయటకు తీశారు. మృతుడి కాళ్లు చేతులు చీరతో కట్టిపడేసి ఉన్నాయి. తలపై బలమైన గాయమైనట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కొడుకు రూ.50లక్షలు అప్పు చేశాడని.. చంపేసిన తల్లి..!
old woman and granddaughter murder Case : షాద్‌నగర్ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు..
మద్యం మత్తులో లొల్లి.. సర్దిచేప్పేందుకు వెళ్లిన వ్యక్తి హత్య