రాష్ట్రంలో ఖరీఫ్ సాగుపై కరవు దాడి చేస్తోంది. జనగామ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. సీజన్ ప్రారంభమై 50 రోజులు దాటినా... ఇప్పటి వరకు 20 శాతం కూడా వరినాట్లు పడలేదు. ఎక్కడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పంటలు చేతికి వచ్చే అవకాశం ఉండదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాభావం నెలకొంది. జిల్లాలో సగటు వర్షపాతం 293.8 మిల్లీమీటర్లు కాగా... 179.9 మిల్లీమీటర్లు కురిసింది. ఇంకా 39.0 శాతం లోటు ఉంది. చిల్పూరులో 77.3 శాతం, కొడకండ్లలో 71.6, బచ్చన్నపేటలో 55.9, లింగాలఘనపురంలో 51.2, జనగామలో 48.6, నర్మెట్టలో 49.1, తరిగొప్పులలో 36.1 శాతం లోటు కనిపిస్తోంది. చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి.
ఇదీ చూడండి : నిర్మాణ పనుల్లో నిబంధనలు తూచ్..!