ETV Bharat / state

'రెండు పడకల గదుల నిర్మాణానికి భూమి పూజ' - స్థానిక మహిళలు

రెండు పడకల గదుల నిర్మాణానికి జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు.

మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని మహిళల ధర్నా
author img

By

Published : Jul 15, 2019, 11:36 PM IST

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని బీడీ కాలనీలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శంకుస్థాపన చేశారు. కట్కూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. స్థానిక మహిళలు మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని ఖాళీ బిందెలతో ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్​లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

రెండు పడకల గదుల నిర్మాణానికి శంకుస్థాపన
ఇవీ చూడండి : ఖమ్మం ఘటన ప్రమాదమా.. నిర్లక్ష్యమా..?

Intro:tg_wgl_61_15_abhivrudhi_panulaku_shankusthapana_ab_ts10070
nitheesh, janagama.8978753177
జనగామ జిల్లా బచ్చనాపేట మండల కేంద్రంలోని బీడీ కాలనీలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం తో పాటు, కట్కూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గం లోని అన్ని గ్రామ పంచాయతీ లకు నూతన గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రానికి సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలో నే ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని దానికి నిధులు తీసుకుని రావడంలో బీజేపీ నాయకులు విఫలం అయ్యారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ల పై ఉందని, దమ్ముంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు బచ్చనాపేట మండల కేంద్రంలో జరిగిన రెండు పడక గదుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరువుతారని తెలుసుకున్న స్థానిక మహిళలు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని కాలి బిందెలతో నిరసన తెలిపారు. స్పదించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య ను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు
బైట్: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్యే జనగామ

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.