మహిళల దీవెనలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించే ముఖ్యమంత్రి అన్ని మతాల పండుగలకు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 1,01,600 చీరలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గత కొన్ని ఏళ్ల కలగా మిగిలిన జనగామను జిల్లా కేంద్రంగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణకే నడిబొడ్డున ఉన్న జనగామ పట్టణంలో మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని.. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనగామ పట్టణంలో అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇవీ చూడండి: బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన మంత్రి గంగుల