జనగామ జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాలను పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నట్లు జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యులు తెలిపారు. తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారం, తరిగొప్పుల, నర్సపూర్ గ్రామాల్లో పర్యటించారు. నీటి సంరక్షణపై గ్రామస్థులు చేపడుతున్న పథకాలపై ఆరా తీశారు. నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి నీటి బొట్టును కాపాడటమే జలశక్తి అభియాన్ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఇవీ చూడండి;వైద్యుల విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం