ETV Bharat / state

నామమాత్రపు ప్రవేశాలు.. 50 శాతం కూడా పూర్తి కాని సీట్లు

ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు విద్యార్థులు ఆసక్తి చూపటంలేదు. ఇంటర్‌ బోర్డు ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచింది. మళ్లీ ఈ నెల 12 వరకు పెంచారు. అయినా ప్రవేశాలు పెరిగే పరిస్థితులు కనిపించడంలేదు. ఈ ఏడాది ప్రవేశాలు కనీసం 50 శాతం పూర్తవలేదు. పత్రికా ప్రకటనల ద్వారా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించినా విద్యార్థుల్లో అలికిడి లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ కళాశాలలతో పాటు ఈసారి ప్రైవేటులోనూ ప్రవేశాలు అతి తక్కువగా నమోదు కావడంతో యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలోని ఏ ఒక్క కళాశాలలోనూ పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అయిన దాఖలాలు లేవు. కొవిడ్‌ ప్రభావమే కారణమని అధికారులు అంటున్నారు.

inter students are not interested to joining the colleges in janagama district
నామమాత్రపు ప్రవేశాలు.. 50 శాతం కూడా పూర్తి కాని సీట్లు
author img

By

Published : Dec 3, 2020, 11:29 AM IST

జనగామ జిల్లాలోని 12 మండలాల్లో ఏడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 22 ప్రభుత్వ సెక్టార్‌కు సంబంధించిన కళాశాలలు, 18 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జనరల్‌, వొకేషనల్‌ విభాగంలో 2,796 సీట్లకు 1,115 భర్తీ అయ్యాయి. గతేడాది 1,090 మంది ప్రవేశం పొందగా ఈసారి కేవలం 25 మంది ఎక్కువగా చేరారు. ప్రైవేటు విభాగంలో 1,219, ప్రభుత్వ సెక్టార్‌లోని కళాశాలల్లో మొత్తం 1,754 సీట్లు భర్తీ అయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. జనరల్‌ విభాగంలోనే గతేడాదితో పోలిస్తే ఈసారి 88 సీట్లు అధికంగా భర్తీ అయ్యాయి. మిగతా విభాగాలన్నింటిలో తక్కువగానే నమోదైనట్లు సమాచారం. అన్ని కళాశాలల్లో కలిపి కనీసం 40 శాతం ప్రవేశాలు కాలేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. పదో తరగతి పూర్తయిన ప్రతి విద్యార్థీ ఇంటర్‌లో చేరడానికి అర్హత సాధించినా ప్రవేశాలు పెరగకపోవడం పట్ల ప్రైవేటు యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.

ఆన్‌లైన్‌ తరగతులపై విద్యార్థుల అనాసక్తి..

ప్రవేశం పొందిన విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. సంబంధిత కళాశాల బోధకులు వాట్సప్‌ గ్రూపుల్లో చేర్చుకొని పాఠాలు వినేలా తోడ్పాటునందిస్తున్నారు. చరవాణుల ద్వారా సందేహాలను నివృత్తి చేస్తున్నారు. వీరిలో విద్యార్థుల్లో 50 శాతం మందికే ఆన్‌లైన్‌ సౌకర్యం ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికి ఆసక్తి చూపట్లేరు. గ్రామీణ విద్యార్థులు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రత్యక్ష బోధనకు సడలింపు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ ప్రభావం అన్ని రంగాల కంటే విద్యారంగంపై అధిక ప్రభావం చూపింది.

కొవిడ్‌ ప్రభావంతోనే తగ్గుదల..

నిర్ధేశించిన లక్ష్యం కంటే ఈసారి తక్కువగానే ప్రవేశాలు జరిగాయి. ఇందుకు కారణం కొవిడ్‌ ప్రభావమే. ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నా విద్యార్థుల్లో అనాసక్తి ఎక్కువగా కనబడుతోంది. బోధకులు వాట్సప్‌ గ్రూపుల ద్వారా సమాచారం ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రవేశాలకు ఈనెల 12వరకు గడువు పెంచుతూ ఇంటర్‌ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడైనా పెరుగుతాయో చూడాలి. --బైరి శ్రీనివాస్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి.

ఇవీ చూడండి: నగరం నిద్రపోతున్న వేళ.. దొంగల చేతివాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.