జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గురుపౌర్ణమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. భక్తులు లేక ఆలయాలు బోసిపోయాయి. తెల్లవారుజాము నుంచే అన్ని సాయిబాబా ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని లలితాంబికా దేవాలయంలో భక్తులు హోమాలు నిర్వహించారు. మీదికొండ గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గురుపూజ విశిష్టతను భక్తులకు వివరించారు.