జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని బుగులు వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణం బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో, వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. వేద పండితుల మంత్రాల నడుమ ఈ తంతు జరిగింది. గురువారంతో ధనుర్మాసం పూర్తవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. శుక్రవారం నుంచి యథావిధిగా స్వామి వారి సేవలు ప్రారంభిస్తామన్నారు.
జిల్లాలోని పలు దేవాలయాల్లో సంక్రాంతిని పురస్కరించుకొని గోదా రంగనాథ స్వామి కల్యాణం జరిపారు. భక్తుల రాకతో ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండి: వంట నూనెల విషయంలో జాగ్రత్త అవసరం: డీడీఎస్