జనగామ జిల్లాలో జర్మనీ దేశస్థులు సందడి చేశారు. ఓబుల్ కేశ్వాపురం గ్రామంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించారు. ములుగు జిల్లాలో నెల రోజులు యోగా శిక్షణా తరగతులు పూర్తి చేసుకున్నారు.
తిరుగు ప్రయాణంలో తెలంగాణ ఆలయాల సందర్శనలో భాగంగా కల్యాణ వెంకన్న సన్నిధికి చేరుకున్నారు. ఆలయ వాతావరణం, భక్తిభావం చాలా బాగున్నాయని విదేశీయులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను: కేసీఆర్