జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లలకు ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు పాదాభివందనం చేశారు.
ఈ సందర్భంగా వారు అందిస్తున్న సేవలను ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ కొనియాడారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటించటంతోపాటు విధిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లపల్లి ఉమాతోపాటు తెరాస మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు