డీజిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో డీజిల్ కోసం స్థానికులు ఎగబడిన ఘటన జనగామ జిల్లాల్లో చోటుచేసుకుంది. జిల్లాలోని రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై జనగామ నుంచి వస్తున్న ఇండియన్ ఆయిల్ డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌కు గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.
బోల్తా పడ్డ ట్యాంకర్ నుంచి డీజిల్ కారుతుండడంతో స్థానికులు డీజిల్ కోసం ఎగబడ్డారు. దొరికిందే అదునుగా.. బకెట్లు, క్యాన్లలో డీజిల్‌ని తీసుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసుల సహాయంతో అందరిని పక్కకు తప్పించి ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఫోమ్‌ని పిచికారీ చేశారు. మొత్తానికి ఒకరి ప్రమాదం మరొకరికి ఆదాయం అయిందన్నమాట.
ఇదీ చుడండి: ఆన్లైన్ లోన్ వేధింపులు.. బలవుతున్న యువత