కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. జనగామలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఆయన.. దుకాణదారులకు, రైతులకు పలు సూచనలు చేశారు.
నిపుణులు, వ్యవసాయ అధికారులు సూచించిన ఉత్తమ ప్రమాణాలు గల నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. అనుమతి పొందిన దుకాణదారులు మాత్రమే విత్తనాలను అమ్మాలని, అనుమతి లేని వారు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి విత్తనాలు, ఎరువులకు సంబంధించిన బిల్లులను భద్రంగా దాచుకోవాలని, సరైన దిగుబడి రానట్లయితే సంబంధిత దుకాణంపై కేసు నమోదు చేయొచ్చని సూచించారు.
ఇదీచూడండి: 'వారానికి ఓ రోజు ఓ పదినిమిషాలు ఆ పనికి కేటాయించండి'