కొవిడ్ టీకా సురక్షితమైనదని.. దానిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కొవిడ్ టీకా తీసుకున్నారు.
టీకా తీసుకునే ముందు.. తీసుకున్న తర్వాత వైద్యశాఖ సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించాలని రాజయ్య సూచించారు. కొవిడ్ సమయంలో ముందుండి పోరాడిన వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి ముందుగా టీకా ఇచ్చారని గుర్తు చేశారు. టీకా తీసుకోవడం తనకు వచ్చిన అద్భుత అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు.
ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన