ఆపద సమయంలో ఆదుకునే మనసున్న గొప్పవ్యక్తి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి తెలిపారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని వెల్దండలో ఎంపీ అందించిన రూ.6లక్షల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వెల్దండకు చెందిన ఓ వ్యక్తి దిల్లీకి వెళ్లి రావటం వల్లే కరోనా వైరస్ వచ్చిందే తప్ప.. గ్రామంలో పుట్టింది కాదని జంగా రాఘవరెడ్డి తెలిపారు.
క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకోవాలే తప్ప... ఏమైపోతుందో అనే భయాందోళనలు అవసరం లేదన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు.