ETV Bharat / state

పాలకుర్తి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

తమను పాశవికంగా కొట్టిన జనగామ జిల్లా పాలకుర్తి ఎస్సై సతీశ్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు హెచ్‌ఆర్సీని వేడుకున్నారు. భూ తగాద విషయంలో అనవసరంగా జోక్యం చేసుకున్నారని ఆరోపించారు.

పాలకుర్తి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
పాలకుర్తి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
author img

By

Published : Jul 2, 2020, 11:04 PM IST

భూ తగాదా విషయంలో అనవసర జోక్యం చేసుకోవడమే కాకుండా... ప్రశ్నించినందుకు విచక్షణా రహితంగా చితకబాదిన జనగామ జిల్లా పాలకుర్తి ఎస్సై సతీశ్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. జిల్లాలోని విన్నూరు గ్రామంలో రజక కుల వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు వారు కమిషన్‌కు వివరించారు.

తమకు తమ పాలోళ్లకు భూమి తగాదా నడుస్తోందని.. ఈ విషయంలో పాలోళ్లు తమపై ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై కొతకాలంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని వారికి ఇవ్వక పోవడం వల్ల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి.. మహిళలని చూడకుండా కర్రలతో విపరీతంగా కొట్టాడని కన్నీరు పెట్టుకున్నారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తించి... పాశవికంగా కొట్టిన ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇదే విషయంపై డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు.

ఇది చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.