Bhatti Vikramarka Padayatra in Janagama district: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో కొనసాగుతోంది. నిన్నటి రాత్రి విరామ కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర హాన్మంతపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కాసేపు రైతులతో ముచ్చటించారు.
మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంలో.. భట్టి పాదయాత్ర చేస్తున్నారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో పొన్నాల లక్ష్మయ్య పాల్గొనగా.. నిన్నటి గొడవతో కొమ్మూరి ప్రతాపరెడ్డి, అతని అనుచరులు.. భట్టి పాదయాత్రకు దూరంగా ఉన్నారు.
ఇవాళ అనుచరులతో సమావేశం కానున్న కొమ్మూరి ప్రతాపరెడ్డి సాయంత్రం జనగామలో జరిగే కార్నర్ మీటింగ్‌లో పాల్గొనాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. కొమ్మూరీ ప్రతాప్ రెడ్డి వర్గం నాయకులు.. పాదయాత్రలో పాల్గొనేలా చూడాలని భట్టిని కోరగా.. పొన్నాల లక్ష్యయ్య అభ్యతరం వ్యక్తం చేశారు.
వడగండ్ల వానతో నష్టపోయిన వరి పంటను పరిశీలించి, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి బిడ్డకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ను ఎదురించి పోరాడే ధైర్యం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని అన్నారు.
అదిలాబాద్ జిల్లా పిప్పిరిలో మొదలయిన భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రాష్ట్రంలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో 1,365 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. 91 రోజుల పాటు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగే ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం పట్టణంలో జూన్ 15వ తేదీన ముగియనుంది. మరో వైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపట్టారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహరంలో ప్రభుత్వ అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంకల్పించారు.
"కేసీఆర్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులను.. రిడిజైన్ పేరుతో వేల కోట్లు దండుకున్నారు. త్వరలో బస్ యాత్ర చేపట్టి తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నీటి ప్రాజెక్ట్‌లోని కుట్రలు బహిర్గతం చేస్తాము. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ప్రజలపై ప్రేమ లేదు.. భూముల మీద ఉంది. ఎక్కడ భూములు కనిపించిన కబ్జాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. దేవాదుల ద్వారా కరువు ప్రాంతమైన జనగామకు గోదావరి జలాలను తీసికొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇవీ చదవండి:
- T Congress: ఒకే వేదికపై ముగ్గురు ఎంపీలు.. ఈ అరుదైన సీన్ చూశారా..?
- REVANATH on ORR: 'రూ. 1000 కోట్లకు ఔటర్ రింగ్ రోడ్డు అమ్మకం.. దేశంలోనే అతి పెద్ద కుంభకోణం'
- Revanth Reddy: 'ప్రభుత్వ పరీక్షలు నిర్వహించలేని స్థితిలో సీఎం కేసీఆర్ పాలన'
- Etela Rajender: 'దళితబంధులో అవినీతి జరుగుతుందని కేసీఆర్ స్వయంగా చెప్పారు'