హైదరాబాద్ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం కూల్చిన ఘటనకు నిరసన చేపట్టిన మంద కృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. వెంటనే మంద కృష్ణను విడుదల చేయాలని నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి అవమానం చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: "ప్రతిపక్షాలపై తెరాస రాజకీయ కక్ష సాధిస్తోంది"