bandi sanjay fires on cm kcr సంచార జాతులు తలచుకుంటే ప్రభుత్వాలు మారతాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. జనగామ జిల్లాలో ఐదో రోజు ప్రజా సంగ్రామ పాదయత్రలో భాగంగా... చీటకోడూరు రచ్చబండలో సంచార జాతులతో బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ సర్కారును గద్దె దించే అవకాశం వచ్చిందని వెల్లడించారు. సంచార జాతుల బాధలు చూస్తే దుఃఖం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి తామూ సంచార జీవనమే గడుపుతున్నామని బండి సంజయ్ తెలిపారు.
bandi sanjay on sanchara jathulu సంచార జీవుల కష్టాలు స్వయంగా చూశామని చెప్పారు. అధికారంలోకి వస్తే సంచార జాతులను ఆదుకుంటామని హామీనిచ్చారు. బీసీ ద్రోహి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఇదే పాదయాత్రలో భాగంగా.. జీఎస్టీ మినహాయించాలంటూ బండి సంజయ్‌కి చేనేత కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. జీఎస్టీ మినహాయింపునకు కృషి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
మీరు తలచుకుంటే ప్రభుత్వాలు మారతాయి. కేసీఆర్ సర్కారును గద్దె దించే అవకాశం ఇదే. సంచార జాతుల బాధలు చూస్తే దుఃఖం వస్తుంది. ఏడాది నుంచి మేమూ సంచార జీవనమే గడుపుతున్నాం. సంచార జీవుల కష్టాలు స్వయంగా చూశాం. భాజపా అధికారంలోకి వస్తే సంచార జాతులను ఆదుకుంటాం. బీసీ ద్రోహి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
BandiSanjay In Jangaon ఈ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ మొదటి నుంచి కేసీఆర్ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వచ్చారు. తెరాస వైఫల్యాలు, కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలను ఊరూరా వివరించారు. ఒక దశలో కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు పరిధులు దాటాయని భావించిన తెరాస నాయకులు భాజపాపై విరుచుకుపడ్డారు.
bandi sanjay padayatra మరోవైపు మూడో విడత పాదయాత్ర యాదాద్రిలో ప్రారంభం కాగా... ఈ యాత్రలో బండి సంజయ్ ఊరూరా తిరుగుతూ తెరాస పాలనను ఎండగట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పనితీరును విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, రాష్ట్ర ఆరోగ్య రంగం పనితీరుపై విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: