రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జనగామలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డీసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డయల్ 100పై అవగాహన కల్పించారు.
అమ్మాయిలు ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా ఆకతాయిలు వెంటపడితే వెంటనే 100కు డయల్ చేయాలని డీసీపీ సూచించారు. 5 నిమిషాల్లో పోలీసులు చేరుకుని రక్షణ కల్పిస్తారని తెలిపారు.
ఇవీ చూడండి: అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి