ఓటు ద్వారా నేతల తలరాతలే కాదు..మన భవిష్యత్తునూ మార్చుకోవచ్చు. బంగారుమయం చేసుకోవచ్చు. మనకు నచ్చిన ప్రజాప్రతినిధిని మనమే ఎన్నుకునే....గొప్ప అవకాశం రాజ్యాంగం మనకు కల్పించింది. అయినా కొంతమందికి ఓటు విలువ తెలియట్లేదంటున్నారు....జనగామ కళాకారులు.
ప్రజాస్వామ్యానికి పునాదిరాయి లాంటి ఓటును అమ్ముకోవద్దని....ప్రలోభాలకు లొంగద్దంటూ తమ పాటల ద్వారా ప్రజల్లో ఓటుపై అవగహన కలిగిస్తున్నారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి : ఈ బెలూన్లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు