జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన పనుల పురోగతిపై జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ప్రజా వేదిక నిర్వహించారు. డీఆర్డీఓ గూడూరు రామ్‌రెడ్డి ఉపాధిహామీ కార్మికులకు 100 రోజులు పనులు కల్పించాలని అన్నారు.
ప్రభుత్వం తాజాగా చేపట్టిన నర్సరీలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ కార్మికులు అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల రేఖ, జడ్పీటీసీ సభ్యుడు మారుపాక రవి, ఎంపీడీఓ కుమారస్వామి, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మహబూబ్‌నగర్‌లో రీపోలింగ్... ఐదుగురి సస్పెన్షన్