ETV Bharat / state

మరో మహిళా వలస కూలీకి కరోనా పాజిటివ్ - corona case update in janagoan district

జనగామ జిల్లా చిల్పూరు మండలంలో ఓ మహిళా వలస కూలీకి కరోనా నిర్ధరణయ్యింది. బాధితురాలు ఇటీవలే భివండి నుంచి స్వగ్రామానికి వచ్చినట్లు డిప్యూటీ డీఎంహెచ్​వో అశోక్​కుమార్​ తెలిపారు. దీంతో పాటు జిల్లాలో మొత్తం మూడు యాక్టివ్​ కేసులున్నట్లు వివరించారు.

a-lady-migrant-got-corona-in-janagaon-district
మరో మహిళా వలస కూలీకి కరోనా పాజిటివ్
author img

By

Published : May 17, 2020, 12:01 PM IST

జనగామ జిల్లా చిల్పూర్​ మండలానికి చెందిన ఓ మహిళా వలసకూలీకి కరోనా వైరస్​ సోకింది. ఈమె ఇటీవలే భివండి నుంచి స్వగ్రామానికి రాగా... జ్వరం లక్షణాలు కనిపించాయి. ఈ నెల 14న కరోనా వైరస్​ నిర్ధరణ పరీక్షలు చేసేందుకు హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్​వో అశోక్​కుమార్​ తెలిపారు.

ఇప్పుడు ఆమెకు కొవిడ్​ పాజిటివ్​ రాగా.. కింగ్​ కోఠి ఆసుపత్రిలోనే చికిత్స అందించనున్నట్లు అశోక్​కుమార్​ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం నిడిగొండకు చెందిన ఇద్దరు వలస కూలీలకు కరోనా పాజిటివ్​ నమోదు కాగా.. జిల్లాలో ఇది మూడో కేసు అని అశోక్​ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.