జనగామ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 34 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ తర్వాత జనగామలోనే అధికంగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో ఆక్టివ్ చేసుల సంఖ్య 59కి చేరింది.
మొదటగా జిల్లా కేంద్రంలోని ఓ ఎరువుల దుకాణ యజమానికి వైరస్ సోకగా తర్వాత అతని కుటుంబ సభ్యులు, దుకాణంలో పనిచేసేవారికి, దుకాణంలో మిగిలిన నలుగురు భాగస్వాములకు... ఇలా మొత్తం 25 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు జనగామ జిల్లా కేంద్రంలోనే కేసులు నమోదు కాగా తాజాగా బచ్చనపేట, నర్మెట్ట , రఘునాథపల్లి, దేవరుప్పుల, లింగలఘనుపూర్ మండలాల్లో పలువురికి కొవిడ్ నిర్ధరణయింది.
ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన