జనగామ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆబ్కారీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 130.3 కిలోల ఎండు గంజాయిని అధికారులు స్వాధీన పరుచుకున్నారు. కిలోకు 20వేల రూపాయల చొప్పున 26లక్షల రూపాయల విలువైన గంజాయి పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఒరిస్సాలో కొనుగోలు చేసి హైదరాబాద్, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులకు చేరవేస్తున్నారు. నలుగురు నిందితులు గత మూడు సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులుగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవీచూడండి: ప్రకృతి ప్రేమికుల మనసు దోచే హుకో జలపాతం