జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మఠం హనుమాన్ వార్డుకుచెందిన తోకల ప్రవీణ్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. కరోనా ప్రభావంతో ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ పోషణ భారమైంది. అయినా ధైర్యంతో ముందుకు వెళ్లాడు. మెట్పల్లిలోని మొదటి వార్డులో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండడంతో.. తనవంతు సాయంగా హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని తీసుకువచ్చాడు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి.. పిచికారీ చేశాడు.
కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ.. అత్యవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని... ఎవరైనా వచ్చి సాయం చేయాలని కోరాడు.
ఇదీ చూడండి: తొలి నుంచీ ఆధిక్యంలో తెరాస అభ్యర్థి నోముల భగత్