రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మానవత్వం చాటుకున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. మల్యాల వద్ద జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో పని చేసే ఎర్రం హరిచరణ్ అనే ఉద్యోగి ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయి సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.
అతన్ని గుర్తించిన వినోద్‌కుమార్ కారును ఆపి ఆయనే స్వయంగా 108 వాహనానికి ఫోన్ చేశారు. అతనికి వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను కోరారు. వెంటనే అతన్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం