ETV Bharat / state

పల్లెకు వన్నె తెస్తున్న ప్రకృతి వనాలు.. యుద్ధ ప్రాతిపదికన పనులు!

ఒకప్పుడు పల్లెల్లో ఎటు చూసినా పచ్చదనంతో వెల్లివిరిసేది. రాను రాను ఆ పచ్చదనం కరువవుతున్నది ఈ నేపథ్యంలో సర్కారు రాష్ట్రంలో పచ్చదనం పెంచే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా.. ఓవైపు హరితహారం, మరోవైపు పల్లెల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన పనులు జగిత్యాల జిల్లాలో యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. 420 ప్రకృతి వనాల్లో ఇప్పటికే 285 వనాల నిర్మాణం పూర్తయింది.

Village Nature Centers Construction Works Almost Done In Jagitial District
పల్లెకు వన్నె తెస్తున్న ప్రకృతి వనాలు.. యుద్ధ ప్రాతిపదికన పనులు!
author img

By

Published : Sep 15, 2020, 7:22 PM IST

తెలంగాణ ప్రభుత్వం గత అయిదేళ్లుగా హరితహారంలో ప్రతి ఒక్కరిని భాగస్వాముల్ని చేస్తూ.. రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో సైతం పచ్చదనం పెంచేందుకు హరితహారంతో పాటు.. పల్లె ప్రకృతి వనాల పేరుతో చిట్టడవుల నిర్మాణం చేపడుతుంది. ఒక్కో గ్రామానికి ఎకరం నుంచి రెండెకరాల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాలు నిర్మిస్తున్నారు. ఒకే దగ్గర 2 నుంచి 4వేల మొక్కలను పెంచుతున్నారు. గ్రామ ప్రజలు ఉదయం, సాయంత్రం ప్రకృతి వనాల్లో సేద తీరుతూ ఆహ్లాదాన్ని పొందేలా తీర్చిదిద్దుతున్నారు.

పల్లెకు వన్నె తెస్తున్న ప్రకృతి వనాలు.. యుద్ధ ప్రాతిపదికన పనులు!

యుద్ధప్రాతిపదికన పనులు..

జగిత్యాల జిల్లాలో 380 గ్రామ పంచాయతీలుండగా.. 420 వరకు ప్రకృతి వనాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 285 ప్రకృతి వనాలు అందుబాటులోకి వచ్చాయి. మిగతా వాటి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని, కాసేపు ప్రకృతి వనంలో సేదతీరితే.. ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్లలో చిట్టడవులు..

గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనాలు.. రకరకాల పూలమొక్కలు గార్డెన్​ను తలపిస్తున్నాయి. మరో రెండేళ్లలో మొక్కలు చెట్లుగా మారి.. చిన్నపాటి అడవిని తలపించనున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృత వనాల నిర్మాణ పనులు పోటాపోటీగా జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ వీటిపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి.

ఇదీ చదవండి: కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.