వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పంటలు బాగా పండాలని జగిత్యాల జిల్లా ధర్మపురిలో వరుణ యాగాన్ని నిర్వహించారు. ధర్మపురిలోని రామలింగేశ్వరస్వామి ఆలయం, కోటేశ్వరస్వామి ఆలయంలో 108 కళశాలతో స్వామికి అభిషేకం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు యాగం పూర్తి చేసి పూర్ణాహుతి జరిపించారు. రాష్ట్రంలో వానలు బాగా కురిసి... పాడి పంటలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని భక్తులు కోరుకున్నారు.
ఇదీ చదవండిః జింకల పార్కుకెళ్తే... అడవి పంది దాడి