సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో ఎదుటు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. కార్మిక శాఖ పిలుపు మేరకు ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు ఒక్కరు కూడా విధుల్లో చేరకుండా ధర్నాలో పాల్గొంటున్నారు. కార్మికుల కష్టాలను చూసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మెను ఆపేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు.
ఇవీ చూడండి: బిహార్: బోటు ప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతులు