తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కార్మికులు చేపట్టిన ఆర్టీసీ రాష్ట్ర బంద్‌లో భాగంగా జగిత్యాల జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డిపోల పరిధిలో ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లలేదు. జిల్లాలో మొత్తం 263 బస్సులు ఉండగా... కార్మికుల ధర్నాలతో అవన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: జేబీఎస్లో ఉదయమే మొదలైన బంద్ ప్రభావం