జగిత్యాల డిపోలో కండక్టర్గా పని చేస్తున్న బోగ జనార్దన్కు గుండెపోటు వచ్చింది. ఇంటివద్ద ఉన్న జనార్దన్కు ఒక్కసారిగా గుండెపోటు రాగా జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించగా కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు.
గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడిలో జనార్దన్ ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. మూడు రోజుల క్రితమే కిరాణ కొట్టు ఏర్పాటు చేసుకున్నామని.. ఇంతలో వచ్చిన గుండెపోటుతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు