కవితను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్న తెరాస నాయకులు జగిత్యాల జిల్లా కోరుట్లలోని మెట్పల్లిలో తెరాస నాయకులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. స్థానిక గోల్డ్ హనుమాన్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. తెరాస నాయకురాలు కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :10వేల మందితో ఉత్తమ్ టెలీకాన్ఫరెన్స్