ETV Bharat / state

రైలు కాదు ఇది... చదువుల బడి - విద్యార్థులు

ఇదో మారుమూల గ్రామం.. ఇక్కడ రైలు పట్టాలు లేవు గాని రైలు వస్తుంది. అందులో పిల్లలు మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. రైలు ఎక్కిన ప్రతి విద్యార్థి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పట్టాలు లేకుండా రైలు ఏంటి అనుకుంటున్నారా... ఇది జగిత్యాల జిల్లాలోని ఓ పాఠశాల సంగతి.

బడిలోకి వెళ్తున్న విద్యార్థులు
author img

By

Published : Mar 10, 2019, 12:29 PM IST

రైలు కాదు ఇది... చదువుల బడి
జగిత్యాల జిల్లా ఫకీర్ కొండాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గోడలకు అచ్చం రైలు మాదిరిగా పెయింటింగ్ వేసి చిన్నారులను ఆకట్టుకుంటున్నారు. ఏడవ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. గ్రామంలోని ప్రతి పిల్లాడు చదువు కోవాలన్న ఉద్దేశంతో...ఉపాధ్యాయులు ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పాఠశాల గదులకు ఇలా అందంగా రైలు మాదిరిగా పెయింటింగ్ వేయించారు. పాఠశాల తరగతి గదులలో పిల్లలు ఇంటి వద్ద టీవీలో చూసే కార్టూన్ బొమ్మలు డోరా, బుజ్జి, శ్రీ కృష్ణ, హనుమాన్ లాంటి చిత్రాలను పెయింటింగ్ వేయించారు. వీటినిపిల్లలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. పాఠశాలను చూసేందుకు గ్రామస్థులు వచ్చి వారి చరవాణిలో స్వీయ చిత్రాలు దిగుతున్నారు. ఇలా ఆకట్టుకునే రీతిలో ఉండడంతో పిల్లలు బడి బాట పట్టారు.

ఇంతటితో ఆగకుండా ఉపాధ్యాయులు విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో వివిధ రకాల పూల మొక్కలు నాటించారు. ప్రతి విద్యార్థి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజు అరగంట పాటు వారికి యోగపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

స్వచ్ఛందంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యాబోధన చేయడంతో పాటు వారి సొంత ఖర్చులతో పాఠశాలను ఆకట్టుకునే రీతిలో తయారుచేశారు. ఈ పాఠశాల మాదిరిగా అన్ని గ్రామాల్లో ఉపాధ్యాయులు ముందుకొస్తే పిల్లలందరూ బడికి సంతోషంగా హాజరవుతారు.

ఇవీ చూడండి:కొనసాగుతున్న 'మా' పోలింగ్​

Jammu, Mar 07 (ANI): The police have arrested the man who is accused of throwing the grenade at a bus stand in Jammu on Thursday. The blast left one dead and 32 people were injured. Addressing a news conference, Jammu and Kashmir (JandK) police's Manish K Sinha said, "The detained Yasir Javed Bhatt has confessed to his crime during preliminary investigation. He has revealed that he was tasked to throw this grenade by District Commander of Hizbul Mujahideen in Kulgam by the name Farooq Ahmed Bhatt alias Omar. He had started from Kulgam yesterday and reached Jammu in morning after doing the heinous act he was trying to escape but was apprehended."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.