జగిత్యాల జిల్లా తాటిపెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేస్తారన్న నమ్మకం కూడా రైతులకు లేదని వ్యాఖ్యానించారు.
జిల్లాలో పంటనష్టం అంచనా వేసినా ఇప్పటివరకు ఒక్క రైతుకూ పరిహారం ఇవ్వలేదని సంజయ్ ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామంటున్న ఈ ప్రభుత్వం.. ఇప్పటి వరకు కొన్నది 14 లక్షల టన్నులే అని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రుల ప్రకటనల్లో పొంతన లేదని అన్నారు.