జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. 7 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు వేసిన ఇళ్లతో పాటు బయట పడుకున్న వారి ఇంటి తాళాలు పగులగొట్టి దొరికినంత దోచుకెళ్లారు. 10 తులాల బంగారు, 4 తులాల వెండి ఆభరణాలతోపాటు లక్షా 70 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల