సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లిలో గత నెల 21 అర్ధరాత్రి భార్య, పిల్లలపై టిన్నర్ పోసి హతమార్చిన నిందితుడు లక్ష్మీరాజం జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య విమల, కూతురు పవిత్ర, బామ్మర్ది భార్య రాజేశ్వరి, వదిన సునితపై టిన్నర్పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
నిందితుడు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. లక్ష్మీరాజం స్వగ్రామం జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నమిలికొండ కాగా... అతని స్వగ్రామం సమీపంలోనే కొండగట్టు వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంతో తన కొడుకు కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడని... లక్ష్మీరాజం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సిద్దిపేట జిల్లాలో దారుణం