జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులో ఎస్సారెస్పీ చిన్న కాలువ గట్టు తెగిపోయింది. ఫలితంగా నీటి ఉద్ధృతికి సుమారు 100 ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. కాలువకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ మధ్యే మట్టి నింపారు. ఈలోగా కాలువకు సాగునీరు వదలడంతో మట్టి కొట్టుకుపోయి కాలువ తెగిపోయింది.
గుత్తేదారు పనులు నాణ్యతగా చేయకపోవటం వల్లే కాలువ తెగిపోయిందని.. తాము పంటలు నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు మునిగిన పంట పొలాలను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పరిశీలించారు. నష్టం అంచనా వేసి రైతులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. అధికారులు నీటి ప్రవాహం తగ్గించి కాలువకు మరమ్మతులు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ నుంచి పెట్రోల్, గ్యాస్- 12ఏళ్లకు ఫలించిన ప్రయత్నం