దేశ ఎల్లలు దాటినా ఓ ప్రవాస భారతీయుడు మాతృభాషపై మమకారాన్ని చాటుకున్నాడు. వృత్తిరీత్యా అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడిన జగిత్యాల జిల్లా వాసి సురేశ్ కొలిచాల స్వాతంత్య్ర అమృత మహోత్సవ వేళ మహాత్ముడిపై అభిమానాన్నిచాటుకున్నాడు. 'మహాత్మాగాంధీ జయంతి' సందర్భంగా ఆయనకు ప్రీతిపాత్రమైనా 'వైష్ణవ జనతో' భజనను తెలుగులోకి అనువదించి ఆవిష్కరించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వైష్ణవ జనతో భజన సబర్మతి ఆశ్రమంలో ప్రశాంతతకు చిరునామాగా ఉండేది. స్వేచ్ఛావాయువులను ఆకాంక్షించిన నాటితరం ఉద్యమకారుల్లో దృఢ సంకల్పానికి ఈ భజన ఊపిరులూదింది.
గుజరాతీ భాషలో ప్రముఖ కవి నర్సింహ మెహతా 15వ శతాబ్దిలో రచించిన వైష్ణవ జనతో తేనే కహియే, జేపీడ పరాయీ జణేరే' అంటూ హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. దీనికి తెలుగు అనువాదంగా వైష్ణవ తత్వం తెలిసినవారు ఇతరుల వేదన నెరిగేరే, పరులకు దుఃఖం తొలిగించుటలో తన పర భేధం రానీరే!'.. అంటూ లలితమైన పదాలతో ఆవిష్కరించి మాతృభాషపై తన మక్కువను చాటుకున్నాడు. గాయని ప్రశాంతి చోప్రా హృద్యంగా ఆలపించిన భజనను శుక్రవారం విడుదల చేయగా ప్రస్తుతం నెట్టింట ఆకట్టుకుంటోంది. రెండు దశాబ్దాలుగా తెలుగు భాష సాహితీ సేవలో కొనసాగుతున్న సురేశ్ అందరి అభినందనలు అందుకుంటున్నారు.
ఇదీ చదవండి: Mahatma Gandhi: ఆ గ్రామంలో ఏ శుభకార్యమున్నా మొదటి పూజ మాత్రం మహాత్ముడికే...