కరోనా సంక్షోభంతో.. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ప్రాముఖ్యత పెరిగిపోయిందని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు, తెరాస రాష్ట్ర నాయకులు సంజయ్ అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్.. ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడొద్దన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం.. రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేశారు.
పాత్రికేయులు, ఆరోగ్య సిబ్బంది సంక్షేమం దృష్ట్యా.. సొంత ఖర్చుతో కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేసినట్లు సంజయ్ వివరించారు. ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించి.. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ సుజాతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఒకే వ్యక్తికి వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా?