జగిత్యాల జిల్లా వెల్గటూరులోని బ్రిలియంట్ పాఠశాలలో... ముత్తునూర్కు చెందిన ప్రహర్షిని నర్సరీ చదువుతోంది. శనివారం సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత చిన్నారిని గమనించకుండానే సిబ్బంది గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. తమ కూతురు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల వెతికి చివరికి బడికి వచ్చి చూడగా తరగతి గదిలో సొమ్మసిల్లి పడిపోయింది. క్లాస్ రూంలో పిల్లలు ఉన్నారో లేదో చూసుకోకుండా తాళాలు వేయడమేంటని మండిపడ్డారు. అక్కడికి వచ్చి చూడకపోతే తమ కుమార్తె పరిస్థితి ఏంటని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'మెుదటి బోనం సమర్పించిన తలసాని'