జగిత్యాల జిల్లా మెట్పల్లి భాజపా కార్యాలయంలో కాషాయనేతలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.
![telangana liberation day at metpally in jagtial district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-11-17-bjpsambaraalu-avb-ts10037_17092020112728_1709f_00568_355.jpg)
స్వరాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆందోళనలు నిర్వహించిన కేసీఆర్.. నేడు వాటిని మరిచిపోవడం బాధాకరమని భాజపా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మండిపడ్డారు.