జగిత్యాల జిల్లా మెట్పల్లి సహకార సంఘం ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 గంటలకు డైరెక్టర్లు నామినేషన్ దాఖలు చేయాలని అధికారులు ఆదేశించారు. 9 గంటల నుంచి 11 గంటల వరకు అవకాశం కల్పించారు. 13 మంది సభ్యులుండగా... ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఒక్కొక్కరే నామపత్రాలు దాఖలు చేయడం వల్ల ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఎన్నికల అధికారులు ఛైర్మన్‌గా ఎన్నికైన తీగల లింగారెడ్డి, వైస్‌ఛైర్మన్ సురకంటి సంజీవరెడ్డికి ధ్రువీకరణ పత్రాన్ని అందించి అభినందనలు తెలిపారు. నూతన పాలక వర్గానికి పలువురు నాయకులు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు చెప్పారు.
- ఇదీ చూడండి : కాగజ్‌నగర్‌లో పీఏసీఎస్ పదవి తెరాసదే..