ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయంలో అన్నదమ్ముల ఆత్మహత్యాహత్నాం

ఇద్దరు సోదరులు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాహత్నానికి పాల్పడ్డారు. తమ ఐదు గుంటల భూమికి రికార్డులు లేకుండా చేశారని ఆందోళన చేశారు. ఒకరు పురుగుల మందుతో, మరొకరు పెట్రోలుతో ఆత్మహత్యాహత్నానికి పూనుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో చోటుచేసుకుంది.

Tahsildar's office is a reassuring suicide at jagtial
తహసీల్దార్ కార్యాలయంలో అన్నదమ్ముల ఆత్మహత్యాహత్నాం
author img

By

Published : Jun 29, 2020, 11:07 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నాచుపల్లి గ్రామంలో ఐదు గుంటల భూమి రికార్డుల్లో లేకుండా చేశారని మామిడి అంజయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు, కానిస్టేబుల్ అడ్డుకున్నారు.

మామిడి చందు తన వెంట పురుగులమందు డబ్బా తీసుకురాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ భూమి గురించి అడిగితే తహసీల్దార్ కేసు పెట్టారని ఆవేదన చెందారు. ఎస్సై శివకృష్ణ ఇద్దరిని పోలీస్ స్టేషన్​కు తరలించి విచారణ చేస్తున్నారు. మరో వైపు తహసీల్దార్ రవీందర్ రావు నాచుపల్లిలో వీరి భూమి రెండు గుంటలు శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి కాలువ భూసేకరణలో కోల్పోయారని తెలిపారు. మరో మూడు గుంటలు రికార్డు లేకపోవటం వల్ల తప్పుడు సమాచారం అందించి పట్టా పొందారని పేర్కొన్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో అన్నదమ్ముల ఆత్మహత్యాహత్నాం

ఇదీ చూడండి : కరోనాకి భారత్​ బయోటెక్​ 'కోవ్యాక్సిన్'.. జులైలో మానవులపై...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.