ETV Bharat / state

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీ మాతకు పూజలు - కోరుట్ల

అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఆషాఢ మాసంలో ఆర్యవైశ్యులు దైవంగా భావించే వాసవీ మాతకు జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులు గుమిగూడకుండా ఆలయ అర్చకులు మాత్రమే పూజలు నిర్వహించారు.

Special pooja for vasavi maatha in jagitial korutla
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీమాతకు పూజలు
author img

By

Published : Jul 17, 2020, 3:31 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్లలోని వాసవీ మాత ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ మాస పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ.. ఆలయ అర్చకులు మాత్రమే వాసవీ మాతను రకరకాల కూరగాయలతో అలంకరించారు. శాకాంబరి అవతారంలో ఉన్న అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.

ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి వివిధ రకాల పూజలు నిర్వహిస్తూ అందరిలో భక్తిభావాన్ని పెంచుతున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అల్లాడి ప్రవీణ్ తెలిపారు. కరోనా ప్రభావంతో భక్తులెవరినీ ఆలయంలోనికి అనుమతించకుండా ఇళ్లలోనే ఉంచి.. వాసవీ మాత పారాయణం చేయిస్తున్నట్టు వారు తెలిపారు.

ఇదీ చదవండి: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.