ETV Bharat / state

మెట్​పల్లి, కోరుట్లలో ఆర్టీసీ సేవలు షురూ

author img

By

Published : May 19, 2020, 10:42 AM IST

మెట్​పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సులను డిపోల్లోనే శానిటైజ్​ చేసిన తర్వాత పంపిస్తున్నారు.

jagtial district latest news
jagtial district latest news

జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్లలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం 6 గంటల నుంచే డిపోల పరిధిలోని వివిధ ప్రాంతాలకు బస్సులు బయలుదేరాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిపో మేనేజర్లు... డ్రైవర్లు, కండక్టర్లకు బస్సులను నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

మెట్​పల్లి ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరే డ్రైవర్లు, కండక్టర్​లకు చేతులు శుభ్రం చేయించి... ముఖానికి మాస్కు ధరించిన తర్వాతనే వారిని డ్యూటీకి అనుమతించారు. మాస్కులు లేని వారిని తిప్పి పంపారు. అలాగే ప్రయాణికుల చేతులకు శానిటైజర్​ చల్లిన తర్వాతే బస్సులోకి అనుమతించారు. మాస్కులు ధరించని వారిని అనుమతించలేదు. ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాలను దిద్దేందుకు వెళ్లే అధ్యాపకుల కోసం... మెట్​పల్లి ఆర్టీసీ డిపో నుంచి 3 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వారిని కరీంనగర్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.