జగిత్యాలలో ఆర్టీసీ కార్గో సేవలను అదనపు కలెక్టర్ బి. రాజేశం, కరీంనగర్ ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్ ప్రారంభించారు. జగిత్యాల సివిల్ సప్లై గోదాం నుంచి రెండు బస్సుల ద్వారా రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నారు. ఈ బస్సులతో ప్రభుత్వ సబ్సిడి బియ్యం, విత్తనాలు, ఎరువులను సరఫరా చేయనున్నారు.
కార్గో సేవలు అందుబాటులోకి రావటం వల్ల జిల్లాలో రవాణా ఇబ్బంది తప్పనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మరిన్ని కార్గో సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్ తెలిపారు.